బాత్రూమ్‌లో కొండ చిలువ.. మర్మాంగాన్ని కొరికింది
Austrian man bitten by python during visit to the toilet.మనలో చాలా మందికి పాములు అంటే భయం ఉంటుంది.
By తోట వంశీ కుమార్ Published on 7 July 2021 2:12 AMమనలో చాలా మందికి పాములు అంటే భయం ఉంటుంది. బయట ఎక్కడైనా పాము కనిపిస్తే చాలు గుండె దడ మొదలవుతోంది. అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటాము. ఇక బాత్రూంలో పాము కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పైనే పోతాయి గదా. మరీ అలాంటిది ఓ కొండ చిలువ కనిపిస్తే.. ఇక చెప్పేది ఏముంది. ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది కదా. ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తికి ఇలా ఘటననే ఎదురైంది.
వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలోని గ్రాజ్ ప్రాంతలో ఓ 65 ఏళ్ల వ్యక్తి నివసిస్తున్నాడు. ప్రతి రోజు లాగే అతడు ఉదయం నిద్రలేచి.. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూంకు వెళ్లాడు. టాయిలెట్ సీటు మీద కూర్చున్నాడు. కాసేపటికి అతడి మర్మాంగాన్ని ఏదో కరిచినట్లు అనిపించింది. కిందకు చూశాడు. అక్కడ అతడికి ఓ ఐదు అడుగుల కొండ చిలువను చూసి షాక్‌కు గురయ్యాడు. కొద్ది సేపటి వరకు అతడికి ఏమీ చేయాలో అర్థం కాలేదు.
వెంటనే అక్కడి నుంచి దూరంగా జరిగాడు. అతడికి స్వల్పగాయాలు మాత్రమే అవ్వడంతో ఊపిరిపీల్చుకున్నాడు. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా.. ఆ కొండ చిలువ సదరు బాధితుడి పొరుగింట్లో ఉండే 24ఏళ్ల వ్యక్తిదని తేలింది. డ్రైనేజీ ద్వారా అక్కడకు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ యువకుడి వద్ద 11 పాములు ఉన్నట్లు గుర్తించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించింనందుకు అతడిపై కేసు నమోదు చేశారు.