సెల్పీ అడిగాడు.. ముద్దిచ్చాడు.. క‌రోనా వ‌చ్చింది

Arshi khan fan kisses her video viral.ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియా, బిగ్ బాస్ వంటి షోల ద్వారా కొంద‌రు సెల‌బ్రెటీలుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2021 2:43 PM GMT
సెల్పీ అడిగాడు.. ముద్దిచ్చాడు.. క‌రోనా వ‌చ్చింది

ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియా, బిగ్ బాస్ వంటి షోల ద్వారా కొంద‌రు సెల‌బ్రెటీలుగా మారుతున్నారు. ఇక సెల‌బ్రెటీలకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌డం స‌హ‌జం. సెల‌బ్రెటీలు బ‌య‌ట క‌నిపిస్తే చాలు.. వారి అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండ‌దు. ఫోటోలు, వీడియోలు అంటూ వారి వెంట ప‌డుతుంటారు. ఒక్కొసారి ఇవి స‌ద‌రు సెల‌బ్రెటీల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. తాజాగా హిందీ బిగ్ బాస్ సీజ‌న్-14 కంటెస్టంట్ అర్షి ఖాన్ కు ఇలాంటి ఇబ్బందే ఎదురైంది.

ఆమె ముంబై విమానాశ్ర‌యంలో ఉండ‌గా.. ఓ అభిమాని అక్క‌డ‌కు వ‌చ్చాడు. త‌న‌కు ఓ సెల్పీ కావాల‌ని ఆమెను అడిగాడు. అందుకు ఆమె కూడా ఒప్పుకుంది. అయితే.. ఫోటోకు ఫోజిస్తుండ‌గా.. అత‌డు స‌డెన్ గా ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. దీంతో అర్షిఖాన్ ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. వెంట‌నే తేరుకుని అక్క‌డ నుంచి వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. కాగా.. ఈ ఘ‌ట‌న జ‌రిగిన మ‌రుస‌టి రోజే త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిన‌ట్లు అర్షిఖాన్ త‌న ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. కాగా.. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ముద్దు ఇచ్చాడు.. క‌రోనా తెచ్చుకున్నాడు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. మ‌రీ అత‌డికి కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చిందో లేదో ఇంకా తెలియ‌లేదు.


Next Story