ఏంటీ..? సూప్ నచ్చలేదని.. మేనేజర్ ముఖంపై పోసిందా..!
Angry restaurant customer throws steaming soup in manager's face.సాధారణంగా మనం రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు మనకు
By తోట వంశీ కుమార్ Published on 11 Nov 2021 11:32 AM ISTసాధారణంగా మనం రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు మనకు నచ్చిన ఆహారం ఆర్డర్ చేసుకుని తిని ఎంచక్కా వచ్చేస్తాం. ఒక్కోసారి సర్వ్ చేసిన ఆహార పదార్థాలు నచ్చకుంటే ఏం చేస్తాం.. మేనేజర్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేస్తాం. లేదా ఎందుకు వచ్చిన గొడవలే అని తినకుండా వచ్చేస్తాం కొన్నిసార్లు. అయితే.. ఇక్కడ ఓ మహిళా కస్టమర్ రెస్టారెంట్‌కు వెళ్లింది. తనకు నచ్చిన సూప్ ఆర్డర్ ఇచ్చింది. అయితే.. ఆమెకు సర్వ్ చేసిన సూప్‌లో కొన్ని ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. అంతే ఆగ్రహాంతో ఊగిపోయిన సదరు మహిళా కస్టమర్ మేనేజర్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేస్తూనే.. మేనేజర్ ముఖం పై ఆ సూప్‌ను పోసేసింది. ఈ ఘటన టెక్సాస్ నగరంలో జరిగింది.
టెక్సాస్ నగరంలోని ఓ రెస్టారెంట్‌కు యువతి, యువకుడు వచ్చారు. యువతి స్పైసీ స్పైసీ మెక్సికన్ సూప్ ఆర్డర్ చేసింది. ఆమెకు సర్వ్ చేసిన సూప్‌లో కొన్ని ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయంటూ రెస్టారెంట్ మేనేజర్ జన్నేల్లే బ్రోలాండ్ తో గొడవకు దిగింది. ఆ సూప్ కంటైనర్ మూత ఎలా కరిగిపోయిందో చూపిస్తూ.. మేనేజర్ బ్రోలాండ్ ముఖంపై విసిరికొట్టి.. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. మేనేజర్ బ్రోలాండో ఆ యువతిని పట్టుకునేందుకు యత్నించినప్పటికి లాభం లేకపోయింది. ఆ యువతి కారు ఫోటోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆ యువతిని పట్టుకున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.