థ్రిల్ కావాలంటే చివరి వరకూ చూడండి అంటున్న ఆనంద్ మ‌హీంద్ర‌

Anand Mahindra shares video of rider encountering bears in the Nilgiris.ప్ర‌ముఖ వాహ‌న త‌యారీ సంస్థ మ‌హీంద్రా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2021 7:40 AM GMT
థ్రిల్ కావాలంటే చివరి వరకూ చూడండి అంటున్న ఆనంద్ మ‌హీంద్ర‌

ప్ర‌ముఖ వాహ‌న త‌యారీ సంస్థ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్ర ఎల్ల‌ప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటార‌నే విష‌యం తెలిసిందే. ఆయ‌న చేసే ట్వీట్లు ఎంతో స్పూర్తిదాయంగానూ, ఆలోచింప‌జేసే విధంగానూ ఉంటాయి. తాజాగా ఆయ‌న ఓ వీడియోను పోస్ట్ చేశారు. మోటార్ సైకిళ్లను వెంటాడుతున్న ఎలుగుబంటి వీడియోను షేర్ చేయగా.. 52వేల వ్యూస్ వ‌చ్చాయి. ఈ వీడియోను జావా మోటార్ సైకిల్స్ టీంకు ట్యాగ్ చేసి సలహా కూడా ఇచ్చారు.

వీడియోలో ఏం ఉందంటే.. ఓ వ్య‌క్తి బైక్ న‌డుపుతూ.. వీడియోను రికార్డు చేస్తున్నాడు. టీ గార్టెన్ లో ఇరు వైపులా ఉన్న పొదలు చూపిస్తుండగా వీడియో మొదలైంది. అలా పచ్చని ప్రకృతిలో వెలుతుండ‌గా.. రోడ్డు మీద‌ మూడు ఎలుగుబంట్లు కనిపించాయి. అంతే.. ఎలుగు బంట్లు క‌నిపించ‌గానే ఆ వ్య‌క్తి కాస్త దూరంగా ఆగిపోయాడు. వాటిని వీడియోలో రికార్డు చేస్తున్నాడు. కొద్దిసేపు ప్ర‌శాంతంగా ఉన్నాయి ఆ ఎలుగుబంట్లు. కొద్దిసేప‌టి త‌రువాత ఓ ఎలుగు బంటి అత‌డి వైపున‌కు దూసుకువ‌చ్చింది. దీంతో ఈ వీడియో పూర్తి అయ్యింది.

ఈ వీడియోను పోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా.. 'నీలగిరి పర్వతాల్లో ఏదో ఒక ప్రదేశంలో ఇది జరిగింది. థ్రిల్ కావాలంటే క్లిప్ చివరి వరకూ చూడండి. జావా మోటార్ సైకిల్స్ టీం ఎలుగుబంట్లు వార్నింగ్ ఇస్తే జాగ్రత్తగా ఉండాలనే దానిని ఇంట్రడ్యూస్ చేయాలి' అని ఆ పోస్టుకు కామెంట్ పెట్టారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story