అమ్మాయిలు అలర్ట్.. వాలెంటైన్స్ డే నాటికి మీకు కనీసం ఒక్క బాయ్‌ప్రెండ్ అయినా ఉండాలి. లేకపోలే మిమ్మల్ని ఆ రోజు నుంచి కాలేజీకి రానివ్వం. మీకు బాయ్ ప్రెండ్ ఉన్నాడనడానికి రుజువుగా.. అతడితో కలిసి దిగిన ఓ ఫోటోను చూపించాలి. ఇదంతా మీ భద్రత కోసమే. అంటూ ఓ కాలేజీ యాజమాన్యం ఆ కాలేజీ విద్యార్థినులకు పంపిన ఓ సర్క్యులర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సర్క్యులర్ సారాంశం అంతటితో ఆగలేదు. 'అమ్మాయిలూ.. ప్రేమను పంచండి' అంటూ ఓ సలహా కూడా ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని సెయింట్ జాన్స్ కాలేజీ పేరిట ఈ సర్య్కులర్ విడుదలైంది. జనవరి 14న జారీ చేసిన ఈ సర్క్యులర్‌లో ప్రొఫెసర్ అశిశ్ శర్మ సంతకం ఉంది. తొలుత ఈ సర్య్కులర్ విద్యార్థుల వాట్సప్ గ్రూప్‌లలో వైరల్‌గా మారాగా.. ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. ఇక్కడ కూడా వైరల్‌గా మారింది. దీని గురించి విద్యార్థులు వారి తల్లిదండ్రులు దృష్టికి తీసుకురాగా.. వారు ఆకాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రిన్సిపాల్ ప్రొ.ఎస్పీ సింగ్ స్పందించారు. కాలేజీ పరువు తీసేందుకు జరుగుతున్న ప్రయత్నమన్నారు.
అసలు ప్రొఫెసర్ అశిశ్ శర్మఅనే పేరుగల లెక్చరర్ తమ కాలేజీలో లేరన్నారు. దీనిపై విచారణ జరిపి.. సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మాయిల్ని ఆందోళన చేయటానికి ఫైనలియర్ విద్యార్థులెవరైనా ఇటువంటి కొంటె పనులు చేసి ఉండవచ్చని కాలేజీ వర్గాలు అనుమాలు వ్యక్తం చేశాయి.