బంపర్ ఆఫర్.. థాలీ తింటే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఫ్రీ
A Restaurant in Pune offers Royal Enfield Bullet as reward for eating a thali.కరోనా మహమ్మారి కారణంగా రెస్టారెంట్
By తోట వంశీ కుమార్
కరోనా మహమ్మారి కారణంగా రెస్టారెంట్, హోటల్స్ బిజినెస్ పడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే జనాలు రెస్టారెంట్‌ల వైపు చూస్తున్నారు. అయినప్పటికి మునపటి స్థాయిలో గిరాకీ రావడం లేదని అంటున్నారు వ్యాపారులు. కస్టమర్లను ఆకర్షించడం కోసం కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు బిల్లులపై డిస్కౌంట్లు.. బై వన్ గెట్ వన్ ఆఫర్లు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అయితే.. ఓ రెస్టారెంట్ యాజమాన్యం వినూత్న ఆఫర్ ప్రకటించింది. స్పెషల్ థాలీని తింటే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఉచితంగా ఇస్తామంటూ ప్రకటన ఇచ్చింది.
థాలీయే కదా తినేద్దామనుకుంటే సరిపోదు. దీనికి కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి. అవి ఏంటి అంటే.. ఈ బుల్లెట్ థాలీ నాన్ వెజిటేరియన్ ఆహారం. నాలుగు కేజీల మటన్, ఫిష్‌తో దీనిని తయారు చేస్తారు. 12 రకాల ఆహార పదార్థాలు దీనిలో ఉంటాయి. ఈ థాలీని 60 నిమిషాలలోగా తినేయాలి. అలా తినేసినవారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను బహుమతిగా ఇస్తామని మహరాష్ట్ర పూణేలోని వడగావ్ మావల్ ఏరియాలో ఉన్న శివరాజ్ హోటల్ ప్రకటించింది.
ఈ స్పెషల్ థాలీలో 12 రకాల వంటకాలను అందుబాటులో ఉంచింది. ఫ్రైడ్ సూర్మాయి, పోమ్రెట్ ఫ్రైడ్ ఫిష్, చికెన్ తందూరీ, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, కొలుంబి బిర్యానీలతో ఉండే ఈ ప్లేట్‌ను 55 మంది టీమ్ తయారు చేయడం విశేషం. దీనిని గంటలో తినేయాలి. ఒక్కో థాలీ ధర రూ.2,500 గా నిర్ణయించారు. ఎవరైనా దీనిని తింటే.. 1.65 లక్షల ఖరీదైన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉచితంగా పొందవచ్చు. మరీ ఈ బైక్‌ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలీ మరీ.