వరుసగా ఇంటికి వచ్చిన పార్శిళ్లు.. అయోమయంలో తల్లిదండ్రులు
A 22 Month old indian american toddler accidentally purchases 2000 dollars worth items in walmart.చిన్నారులు ఏడవగానే
By తోట వంశీ కుమార్ Published on 25 Jan 2022 6:42 AM GMTచిన్నారులు ఏడవగానే చేతికి స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఏడుపు ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు తల్లిదండ్రులు. వీడి గోల భరించే బదులు ఆ ఫోనేదో చేతికిస్తే దానితో ఆడుకుంటూ వాడే కామ్‌గా ఉంటాడని భావించడమే అందుకు కారణం. దీంతో చిన్నారులు మెబైల్ ఫోన్లకు బానిస అవుతున్నారు. ఒక్కోసారి వారు చేసే పనుల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురికాకతప్పదు. ఓ రెండేళ్ల చిన్నారి పొరబాటున 1700 డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు లక్షా 27 రూపాయలతో షాపింగ్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూజెర్సీలో ప్రమోద్ కుమార్, మధు దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవల వారు అక్కడ ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఇంటికి కావాల్సిన ఫర్నీచర్‌ను కొనుగోలు చేసేందుకు వాల్‌మార్ట్ యాప్‌లో కొన్ని వస్తువులను సెలక్ట్ చేసి వాటిని కార్టులో ఉంచారు. ఒక్కొక్కటిగా ప్రాధాన్యత క్రమంలో ఆర్డర్ చేయాలని బావించారు. అయితే.. వారు కార్టులో ఉంచిన వస్తువులు ఒక్కొక్కటిగా డెలివరీ అయ్యాయి.
ఎందుకు ఇలా జరిగిందని తొలుత వారికి అర్థం కాలేదు. చివరకు తమ ఫోన్ నుంచి అవీ ఆర్డర్ చేసినట్లు తెలిసింది. తమ రెండేళ్ల కుమారుడు అయాన్ష్ పొరబాటు వలన ఇలా జరిగిందని తెలుసుకున్నారు. ఈ వస్తువుల విలువ అమెరికన్ కరెన్సీలో 2000డాలర్లు(భారత కరెన్సీలో రూ.1.49లక్షలు) ఉంటుంది. వెంటనే జరిగిన విషయాన్ని వాల్‌మార్ట్‌కు తెలియజేశారు. వారి అభ్యర్థనను మన్నించిన వాల్‌మార్ట్ సంస్థ వారికి అవసరం లేని వస్తువులు ఇస్తే.. వాటికి నగదు చెల్లిస్తామని చెప్పింది. రెండేళ్ల బుడ్డోడు చేసిన ఈ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.