అతనికి 24 ఏళ్లు, ఆమెకు 61 ఏళ్లు... వారి పరిచయం స్నేహంతో మొదలై ప్రేమ వరకు వెళ్లింది. ఇకేముంది.. ఇద్దరు కలిసి ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే వారి వివాహబంధాన్ని చూసి కొందరు ఆశ్చర్యపోగా.. కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి కారణం వారి మధ్య ఉన్న వయస్సు బేధమే.

అమెరికాలో జరిగిన ఈ కొత్త జంట పెళ్లి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. 61 ఏళ్ల వృద్ధ మహిళ షెరిల్, 25 ఏళ్ల యువకుడు కొరాన్‌లకు తొలిసారి 2013లో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ జార్జియా రాష్ట్రంలో ఉంటారు. షెరిల్‌ కొడుకుకు చెందిన షాపులో మొదటిసారిగా వీరికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు పాటు వారు కలుసుకోలేదు. గతేడాది నవంబర్‌ 4న మరోసారి ఈ ఇద్దరు ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే యువకుడు కొరాన్‌ వృద్ధ మహిళ షెరిల్‌కు ప్రపోజ్ చేశాడు. దీంతో వెంటనే షెరిల్‌ అతడి ప్రేమకు అంగీకారం తెలిపింది. సెప్టెంబర్‌ 3వ తేదీన వారికి సన్నిహితులైన కొద్దిమంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. షెరిల్‌కు ఇదివరకే ఏడుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ముగ్గురు ఈ వివాహాన్ని వ్యతిరేకించారు. ఈ ఆసక్తికర పరిణయంపై పలువురు పాజిటివ్ కామెంట్స్‌, నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

అంజి గోనె

Next Story