25 ఏళ్ల తరువాత తెలిసిన నిజం.. ఆ మ‌హిళ.. ఓ మ‌గాడు అని

25 Year old married Chinese woman found born biologically as a man.మ‌హిళ‌గా బావిస్తున్న ఆమె అస‌లు మ‌హిళే కాద‌ని.. పురుషుడిగా జ‌న్మించి జ‌న్యులోపం కార‌ణంగా మ‌హిళా మారింద‌ని డాక్ట‌ర్లు గుర్తించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2021 4:31 AM GMT
25-Year-old married Chinese woman found born biologically as a man

ఆమెకు వివాహం జ‌రిగి ఎంతో ఆనందంగా జీవిస్తోంది. అయితే.. పెళ్లి చేసుకుని చాలా కాలం అయినా కూడా ఆమెకు పిల్ల‌లు పుట్ట‌లేదు. ఇటీవ‌ల ఆమె కాలుకు చిన్న దెబ్బ త‌గిలింది. దీంతో ఆమెను ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ డాక్ట‌ర్ల‌కు అనుమానం వ‌చ్చి ప‌రీక్షించ‌గా.. ఇన్ని రోజులుగా మ‌హిళ‌గా బావిస్తున్న ఆమె అస‌లు మ‌హిళే కాద‌ని.. పురుషుడిగా జ‌న్మించి జ‌న్యులోపం కార‌ణంగా మ‌హిళా మారింద‌ని డాక్ట‌ర్లు గుర్తించారు. పాతికేళ్ల త‌రువాత అస‌లు నిజం తెలుసుకున్న మ‌హిళతో పాటు అంద‌రూ షాకైయ్యారు. ఈ ఘ‌ట‌న చైనాలో జ‌రిగింది.

చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ లో పింగ్‌పింగ్ అనే మ‌హిళా నివాసం ఉంటోంది. సాదార‌ణంగా అమ్మాయిల‌కు కౌమార‌ద‌శ‌కు రాగానే రుతుస్రావం మొద‌ల‌వుతోంది. కానీ పింగ్‌పింగ్ విష‌యంలో అలా జ‌ర‌గ‌లేదు. డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించ‌గా.. ఆమె శ‌రీరంలో ఎదుగుద‌ల నెమ్మ‌దిగా ఉంద‌ని.. సాధార‌ణ స్థితికి రావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పారు. డాక్ట‌ర్ల భ‌రోసాతో ఆ మ‌హిళ‌కు పెళ్లి చేసారు ఆమె త‌ల్లిదండ్రులు. వివాహం జ‌రిగి ఏళ్లు గ‌డుస్తున్నా ఆమెకు పిల్ల‌లు క‌ల‌గ‌డం లేదు. ఇటీవ‌ల పింగ్‌పింగ్ కాలుకి దెబ్బ‌త‌గిలింది. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

డాక్ట‌ర్లు ఆమె కాలుకి ఎక్స్‌రే తీయ‌గా.. ఆమె శ‌రీరంలో ఎముక‌లు ఎద‌గ‌లేద‌ని గుర్తించారు. వారికి అనుమానం వ‌చ్చి మ‌రిన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. వ‌చ్చిన ఫ‌లితాలు చూసి షాక్‌కు గుర‌య్యారు. ఆ ప‌రీక్ష‌ల్లో ఆమెకు గ‌ర్భాశ‌యం, అండాశ‌యం లేద‌ని తేలింది. ఆమె జ‌న్మించ‌డంతోనే స‌రిగా ఎద‌గ‌ని స్త్రీ, పురుష జ‌న‌నాంగాల‌తో జ‌న్మించింద‌ట‌. దీంతో ఆమె బ‌య‌టికి స్త్రీగా క‌నిపిస్తున్నాఆమె పురుషుడ‌ని డాక్ట‌ర్లు చెప్పారు. ఈ కార‌ణంగానే ఆమెకు రుతుస్త్రావం కావ‌డం లేద‌ని చెప్పారు. స‌ద‌రు మ‌హిళ త‌ల్లిదండ్రులు ర‌క్త సంబంధీకుల‌ను వివాహం చేసుకున్న కార‌ణంగానే ఈ జ‌న్యులోపం త‌లెత్తింద‌ని చెప్పారు. దీంతో ఆ మ‌హిళ‌తో ఆమె కుటుంబ స‌భ్యులు షాక్‌కు గురైయ్యారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


Next Story