నానమ్మలాంటి ఆమెతో లవ్వేంటిరా బాబు..!

23 Year old man loves 60 year old woman.ప్రేమ.. దీనిని నిర్వ‌చించ‌డం చాలా కష్టం. ఒక్కొక్క‌రు ఒక్కొలా చెబుతారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2021 4:45 AM GMT
నానమ్మలాంటి ఆమెతో లవ్వేంటిరా బాబు..!

ప్రేమ.. దీనిని నిర్వ‌చించ‌డం చాలా కష్టం. ఒక్కొక్క‌రు ఒక్కొలా చెబుతారు. కొంద‌రు గుడ్డిద‌ని అంటారు. ప్రేమ‌కు కులం, మతం, వయోబేధం లేదని చెబుుతుంటారు. ఏదీ ఎలా ఉన్న‌ప్ప‌టికి.. ప్రేమకి వయస్సు వయస్సు బేదం అని నిరూపించడానికి ఇదిగో ఈ జంటే నిదర్శనం. ఆమెకు 60ఏళ్లు, అత‌డికి 23. ఇద్ద‌రి మ‌ధ్య 37 సంవ‌త్స‌రాల తేడా. అయిన‌ప్ప‌టికి వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్నకెమిస్ట్రీని చూసి కుర్ర ప్రేమికులు కూడా కుళ్లుకుంటారు. ప్ర‌స్తుతం వీరి ల‌వ్‌స్టోరి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

అమెరికాకు చెందిన 23 ఏళ్ల క్వారన్‌ అనే యువకుడు 60 ఏళ్ల చెర్లి అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య 37 ఏళ్ల వ్యత్యాసం. వయసు తమకు పెద్ద సమస్యే కాదంటున్నారు ఈ జంట. అంతే కాదండోయ్ ఆమెకు ముద్దులు పెడుతూ.. హగ్గులిస్తూ డ్యాన్సులు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఫుల్ రొమాన్స్ చేస్తున్నాడు. ఇక ఈ అమర ప్రేమికులు అంతటితో ఆగకుండా తమ ఘన కార్యక్రమాలను సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. వీటిని చూసిన నెటీజ‌న్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. 'ఆమె నీకు నానమ్మలా ఉంది.. పోయి పోయి ఈ ముసలామెను ఎలా లవ్‌ చేశావ్‌.. అసలు మీ బంధాన్ని మీ కుటుంబ సభ్యులు యాక్సెప్ట్‌ చేశారా' అని ప్రశ్నిస్తున్నారు.


ఇందుకు ఆ వృద్ద మ‌హిళా ప్రేమికురాలు స్పందించింది. 'మా బంధం నిజాయితీతో కూడుకొని ఉంది. ఆకారం ముఖ్యం కాదు. ఒకరినొకరం ఎలా అర్థం చేసుకుంటున్నామన్నదే ముఖ్యం. అన్నింటికీ మించి.. మనసు చూసి మేము ఒకరినొకరం ఇష్టపడ్డాం. నా కొడుకులు క్వారిన్ కంటే మూడేళ్లు పెద్దవారు. వారు కూడా మా బంధాన్ని అర్ధం చేసుకుని, మనస్ఫూర్తిగా అంగీకరించారు. మేమేం తప్పు చేయడం లేదు. ఇద్దరం కలిసి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటాం. మమ్మల్ని అర్థం చేసుకోకుండా తప్పుపట్టే వారిని మేం అస్సలు పట్టించుకోం. మా దృష్టిలో వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే' అని తెలిపింది.

ఇక కొంద‌రు వీరి ప్రేమ‌ను ప్ర‌శంసిస్తున్నారు. ఏమ‌రు ఏమ‌నుకున్నా మీరు మాత్రం అవ‌న్నీ ప‌ట్టించుకోకండి. మీ మ‌న‌సుకు న‌చ్చిన ప‌ని మీరు చేయ‌మంటూ స‌ల‌హాలు ఇస్తున్నారు.

Next Story