బస్సు బోల్తా..9 మంది మృతి, మరో 41 మంది..

By రాణి  Published on  29 Jan 2020 6:17 AM GMT
బస్సు బోల్తా..9 మంది మృతి, మరో 41 మంది..

అతివేగం ప్రమాదకరం. నినాదంగా డ్రైవ్ చేయండి. ఇక్కడ మూలమలుపు ఉంది చూసి వెళ్లండి. అని ఎన్నో సూచికల బోర్డులు ఏర్పాటు చేసినా...హెచ్చరికలు చేసినా డ్రైవర్ల తీరులో మార్పు రావట్లేదు. పైగా మంచు ఉన్నప్పుడు కూడా వేగంగా వెళ్తుండటంతో ప్రాణాలు పోతున్నాయ్.

ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మరణించగా..మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని గంజాం జిల్లా తప్టాపానీ ఘాటీ వద్ద బుధవారం ఉదయం జరిగిందీ రోడ్డు ప్రమాదం. బెర్హంపూర్ నుంచి టిక్రీ పట్టణానికి ప్రయాణికులతో వేగంగా వస్తున్న బస్సు బుధవారం తెల్లవారుజామున అదుపుతప్పి తప్టా ఘాటీ వంతెన వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మరణించిన 9 మంది మృతదేహాలను సహాయ సిబ్బంది పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు 41 మందిని చికిత్స నిమిత్తం బెర్హంపూర్, దిగపహాండి ఆస్పత్రులకు తరలించారు.

Next Story
Share it