యువకుడిపై యువతి యాసిడ్ దాడి
By అంజి Published on 29 Jan 2020 8:08 AM IST
ఉత్తరప్రదేశ్: ప్రేమిస్తున్నానని వేధింపులకు గురి చేస్తున్న ఓ ఆకతాయిపై యువతి యాసిడ్ దాడి చేసింది. మీరు చదివినది నిజమే.. దాడి చేసినది అమ్మాయే.. వేధింపులకు గురించి చేసిన అబ్బాయిపైనే.. తనను కాదన్న అమ్మాయిలపై వేధింపులకు పాల్పడటం, యాసిడ్ దాడి చేస్తానని బెదిరించడం, చివరకు ఆ పనికి పాలపడటం మన దేశంలో సర్వ సాధారణం అయిపోయింది. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా భవానీగంజ్ ప్రాంతంలో ఈ దృశ్యం తిరబడింది. తనను వేధిస్తున్న ఓ యువకుడిపై ఓ యువతి యాసిడ్ చల్లేసింది.
స్థానిక మోర్వాన్ పోలీసు స్టేషన్ పరిధిలోని గోదామౌ గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు రోహిత్ యాదవ్.. ఓ డైరీఫామ్‌లో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు. రోహిత్ ప్రేమను యువతి అంగీకరించలేదు. రోజురోజుకు రోహిత్ వేధింపులు అధికమవడంతో.. అతనికి బుద్ధి చెప్పాలని యువతి నిర్ణయించుకుంది. దీంతో మంగళవారం ఉదయం రోహిత్ పని చేస్తున్న డైరీఫామ్ వద్దకు చేరుకుంది. రోహిత్ అక్కడికి రాగానే అతనిపై యాసిడ్ దాడి చేసింది. అయితే యాసిడ్ ముఖంపై కాకుండా చొక్కాపై పడ్డంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. మెడ, భుజాలు, ఛాతిపై గాయాలయ్యాయి. దాడిలో గాయపడ్డ యువకుడిని చికిత్స నిమిత్తంలక్నో ఆస్పత్రికి తరలించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదు