ప్రేమించుకున్నారు.. పెద్దలు ఒప్పుకోలేదు.. క్రైం సినిమాను తలపించే కథ ఇది

వారిద్దరూ ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో వారు చేసిన పని ఓ క్రైం థ్రిలర్‌ సినిమాను తలపించింది. పాపం ఏ సంబందం లేని యువతి వీరి ప్రేమకు బలైంది. మానవత్వం మంట గలిపే ఘటన ఇది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌హెహర్‌లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బులంద్‌హెహర్‌ చెందిన కపిల్, రూబీ అనే యువతీ యువకులు ప్రేమించుకున్నారు. కాగా వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలలో తెలిసింది. వీరిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఎలాగైన పెళ్లి చేసుకోవాలని భావించిన ప్రేమికులు.. అందుకు దారుణమైన పథకం వేశారు. అందులో భాగంగా పూనం అనే యువతి తో సాన్నిహిత్యం పెంచుకున్నాడు కపిల్. వీరి పథకం ప్రకారం గణతంత్ర దినోత్సవం రోజున షాపింగ్‌ కు వెళదాం అని పూనంకు ఫోన్‌ చేశాడు కపిల్. స్నేహితుడు పిలవడంతో పూనం ఎలాంటి సంకోచం లేకుండా వెళ్లింది.

ముందుగా అనుకున్న పథకం ప్రకారం కపిల్‌, రూబీలు పూనం పై దాడి చేశారు. కారు సీటు బెల్టుతో పూనం గొంతు పిసికి చంపివేశారు. అనంతరం పూనం మృతదేహానికి రూబీ దుస్తులు వేసి రూబీ ఇంటి ఆవరణలో పడేశారు. దీంతో చనిపోయింది రూబీ అని అందర్ని నమ్మించి ఆ తర్వాత పరారై పెళ్లి చేసుకోవాలని వారి ఆలోచన. అయితే తాము ఒకటి తలిస్తే దైవ ఇంకోటి తలస్తాది అంటారుగా.. సరిగ్గా అలాగే జరిగింది. చనిపోయింది రూబీ కాదని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగప్రవేశం చేసి నిజాన్ని బయటపెట్టారు. కాగా ఓ టీవీ క్రైం సిరీస్‌లో చూసి తాము ఈ పథకం వేసినట్లు కపిల్, రూబీ వెల్లడించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్