కీలక నిర్ణయం.. నవంబర్ 30 వరకు లాక్‌డౌన్
By సుభాష్ Published on 31 Oct 2020 9:44 AM GMTదేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఒక రోజు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినా.. మరో రోజు తీవ్రంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కంటోన్‌మెంట్ జోన్‌లలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయ్ ప్రకటించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కంటైన్‌మెంట్ జోన్‌లలో నవంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దేశ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు చేసుకున్న మహారాష్ట్రలో నవంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటికి మహారాష్ట్రలో ప్రార్థనా మందిరాలు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ ఫూల్స్‌తో పాటు ఇతర సామాజిక, రాజకీయ కార్యాలయాలు ఇంకా తెరుచుకోలేదు.
ఒడిశాలో ఇప్పటి వరకు 2,90,116 కరోనా కేసులు నమోదు కాగా, అందులో 2,73,838 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు ఒడిశా రాష్ట్రంలో మొత్తం 14,905 కేసులు యాక్టివ్‌లో ఉండగా, మృతుల సంఖ్య 1,320కి చేరినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 0.45శాతం ఉండగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,470 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 12 మంది మృతి చెందారు.