అన్‌లాక్‌-5 నిబంధనలు నవంబర్‌ 30 వరకు పొడిగింపు

By సుభాష్  Published on  27 Oct 2020 12:25 PM GMT
అన్‌లాక్‌-5 నిబంధనలు నవంబర్‌ 30 వరకు పొడిగింపు

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే కొత్తగా నమోదవుతున్న కేసులతో సమానంగా కోలుకున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయినప్పటికీ పూర్తిగా కోవిడ్‌ నియంత్రణ రాలేకపోతోంది. గత కొన్ని రోజుల నుంచి కాస్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పాటించాలని కేంద్రం సూచిస్తోంది. అన్‌లాక్‌ 5 నిబంధనలను కేంద్రం మరోసారి పొడిగించింది. జారీ చేసిన మార్గదర్శకాలను నవంబర్‌ 30 వరకు వర్తిస్తాయని మంగళవారం కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో్ తెలిపింది.

సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, క్రీడా ట్రైనింగ్‌ కేంద్రాలను షరతులతో తెరుచుకునేందుకు సెప్టెంబర్‌ 30న కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఆ మార్గదర్శకాలను నవంబర్‌ చివరి నాటికి వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశించింది. అల ఆగే రెండు రాష్ట్రాల మధ్య అంతర్‌రాష్ట్ర రాకపోకల విషయంలో ఎటువంటి నిబంధనలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. ఆ రాకపోకలకు ఎటువంటి అనుమతి అవసరం లేదని వెల్లడించింది.

కాగా, సినిమా థియేటర్లలో 50శాతం మందితో తెరుచుకోవచ్చని కేంద్రం అనుమతి ఇస్తూ సెప్టెంబర్‌ 30న కేంద్రం హోంశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొన్ని రాష్ట్రాలు సినిమా హాళ్లకు ఇప్పటికే అనుమతులు ఇచ్చాయి. మరి కొన్ని రాష్ట్రాలు మాత్రం థియేటర్లకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో వైరస్‌ వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశాలు ఉండటంతో నిబంధనలు విధించారు.

Next Story