ముఖ్యమంత్రి జగన్‌ భద్రతకు ఆక్టోపస్‌ బృందం

By సుభాష్  Published on  18 Dec 2019 9:50 PM IST
ముఖ్యమంత్రి జగన్‌ భద్రతకు ఆక్టోపస్‌ బృందం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి భద్రత కట్టుదిట్టం చేశారు. అక్టోపస్‌ దళంలో ప్రత్యేక కమాండోలను ముఖ్యమంత్రి భద్రతకు కేటాయించారు. కౌంటర్‌ టెర్రరిజంలోప్రత్యేక శిక్షణ కలిగిన ఈ బలగాలను జగన్‌నివాసం బుధవారం నుంచి భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ తో పాటు ఆక్టోపస్‌ టీమ్‌ కూడా ఇందులో భాగమే. 30 మందితో ఆక్టోపస్‌ టీమ్‌ ప్రత్యేక బృందాలుగా విడిపోయి భద్రత కల్పించనున్నాయి. ఆరుగురు సభ్యుల చొప్పున ఐదు బృందాలుగా ఏర్పడి ఆక్టోపస్‌ టీమ్‌ నిర్ధేశించిన విధులు చేపడుతుంది. సీఎం వెంట ఉండటంతో పాటు ఆయన పర్యటనలు, సభలు, సమావేశాల సందర్భంలో ఆక్టోపస్‌ టీమ్‌లు షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వహిస్తాయి.

Next Story