సర్కారు వారి పాట నుంచి తప్పుకున్న కియారా ?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jun 2020 11:22 AM GMT
సర్కారు వారి పాట నుంచి తప్పుకున్న కియారా ?

'సరిలేరు నీకెవ్వరు'లాంటి బ్లాక్ బస్టర్..సూపర్ హిట్ అందుకున్న తర్వాత మహేష్ బాబు నటిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ చిత్రం పోస్టర్ ను ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి హడావిడి, ఆర్భాటం లేకుండా విడుదల చేశారు. ఆ పోస్టర్ లో మహేష్ సైడ్ లుక్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ అంతా పండగ చేసుకున్నారు. చెవి పోగు, మెడ మీద రూపాయిబిళ్ల టాటూతో ఉన్న పోస్టర్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్ లో కనిపించనున్నట్లు అర్థమవుతుంది. గీత గోవిందం సినిమాకి దర్శకత్వం వహించిన పరశురాంతో జతకట్టిన మహేష్..మంచి సక్సెస్ అందుకుంటారన్న టాక్ వినిపిస్తోంది టాలీవుడ్ లో..

కాగా..మొన్నటి వరకూ ఈ సినిమాలో కియారా అద్వానీ మహేష్ తో రెండో సారి కనువిందు చేయనుందన్న వార్తలొచ్చాయి. తాజాగా..లాక్ డౌన్ కారణంగా ఆమె సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకున్నట్లు సమాచారం. దీంతో కియారా స్థానంలో మహేష్ తో రొమాన్స్ చేసేందుకు సాయి మంజ్రేకర్ ను సెలెక్ట్ చేసినట్లు వినికిడి. సినిమా షూటింగుల విషయంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలతో కూడిన షరతులివ్వడంతో ఈ నెల 10వ తేదీ నుంచి షూటింగులు మొదలవ్వనున్నాయి. త్వరలోనే సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ కూడా సెట్స్ మీదికి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Next Story