కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో యాంకర్‌ సుమ కూడా ఇంటికే పరిమితం అయ్యారు. టీవీ షోలు, ఆడియో, ప్రి రిలీజ్‌ ఫంక్షన్లతో ఎప్పుడూ బీజీగా ఉండేది. లాక్‌డౌన్‌ కావడంతో షూటింగ్‌లు లేకపోవడంతో పుల్‌ టైం దొరికింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు తెలిసిన హెల్త్‌ టిప్స్‌ను వీడియోలను పోస్టు చేస్తుంది.

ఎప్పుడు గల గల మాట్లాడుతుంటుంది సుమ. ఆమె డ్యాన్స్‌ చేసిన సందర్భాలు అరుదు. కానీ తాజాగా అలవైకుంఠ పురంలోని రాములో రాములా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది ఈ స్టార్‌ యాంకర్‌. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. వీడియోలో సుమ పెట్‌డాగ్‌ కూడా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సుమ సూపర్‌ గా డ్యాన్స్‌ చేసింది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు నెటీజన్లు.
రాములో రాములా సాంగ్‌కి మనదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం పుల్‌ ఫేమస్‌ అయ్యింది. ఇటీవల ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఈ పాటకు తన సతీమణితో కలిసి డ్యాన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలోని బుట్ట‌బొమ్మ సాంగ్‌కి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

 

View this post on Instagram

#Longtimenoworkeffects , zorro is mad at me

A post shared by Suma Kanakala (@kanakalasuma) on

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.