ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత పాకిస్థాన్‌ ఇండియా మీద కారాలు, మిరియాలు నూరుతున్న సంగతి తెసిందే. పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఐక్యరాజ్య సమితి వేదికగా అణు యుద్ధం రావొచ్చు అంటూ బాధ్యతారాహిత వ్యాఖ్యలు కూడా చేశారు . అంతేకాదు..కశ్మీర్‌లో అలజడి సృష్టించడానికి పాక్‌ ప్రయత్నిస్తుంది అని చెప్పడానికి భారత్ కు కచ్చితమైన ఆధారాలు దొరికాయి.

పుల్వామాలో మానవ బాంబ్ దాడి తరువాత భారత వాయుసేన పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్ మీద దాడి చేసిన సంగతి తెలిసిందే . ఆ దాడిలో 300 మంది ఉగ్రవాదులు మరణించారని కేంద్రం ప్రకటించింది. బాలా కోట్ ఉగ్ర స్థావరం ధ్వంసమైన ఇమేజ్‌లను భారత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే..కొన్ని రోజుల క్రితం ఆర్మీ ప్రధాన అధికారి చెప్పినట్లు బాలా కోట్ ఉగ్ర శిబిరం మళ్లీ యాక్టివ్ అయింది. మళ్లీ వందలాది మంది టెర్రరిస్ట్ లు శిక్షణ తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది.వీరిలో 50 మంది సూసైడ్ బాంబర్లు కూడా ఉన్నారని స్పష్టం చేసింది.

పాక్ ఆర్మీ దగ్గర ఉండి ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం పాక్‌ నాయకత్వానికి కూడా తెలుసని కేంద్రంలో ఓ ఉన్నతాధికారి స్పష్టంచేశాడు. కశ్మీర్‌లో అలజడి సృష్టించి..ఆర్టికల్ 370 రద్దుతోనే ఇదంతా జరుగుతుందని చెప్పడానికి పాక్‌ నాటకమాడుతుందని కేంద్రంలోని అధికారులు అభిప్రాయపడ్డారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.