ఉత్తర కాలిఫోర్నియాలో భారీ భూకంపం
By అంజి
అమెరికా: ఉత్తర కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవంచింది. ఆదివారం రాత్రి సమయంలో భూమి తీవ్రంగా కంపించిదని స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. రిక్టర్ స్కేలుపై 5.9 భూకంప తీవ్రత నమోదు అయ్యింది. యురేకా పట్టణానికి దాదాపు 62 మైళ్ల దూరంలో ఉత్తర కాలిఫోర్నియా తీరంలో భూకంపం వచ్చింది. పసిఫిక్ మహాసముద్రం క్రింద ఒక మైలు లోతులో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని జియోఫిజిస్ట్ జెస్సికా టర్నర్ తెలిపారు. భూకంపం కారణంగా ఎవరూ గాయపడలేదని తెలిసింది.
ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కాలిఫోర్నియాలో పలు స్కూళ్లకు సెలవులు ప్రకటించారని తెలిసింది. ఇక శానిఫ్రాన్సిస్‌కో, మారిన్ కౌంటీ, తూర్పు సముద్ర తీరంలో కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఇది ఒక నిస్సార భూకంపంగా తలపించింది.
Also Read:
అంతరిక్షంలో పంట సాగు.. వ్యోమగాములకు పండగే..!