ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు అస్వస్థత..?

By రాణి  Published on  21 April 2020 7:15 AM GMT
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు అస్వస్థత..?

ఉత్తర కొరియాలో ఇప్పటి వరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదు. ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తిని ఉత్తర కొరియా కాల్చి చంపేసిందన్న వార్తలొచ్చాయి. ప్రస్తుతానికి మాత్రం ఉత్తర కొరియా వైరస్ ఫ్రీ కంట్రీ. అయితే తాజాగా..అధ్యక్షుడు కిమ్ ఆరోగ్యం అంతగా బాలేదన్న వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని ఉత్తర కొరియా మీడియా ఇంకా వెల్లడించనప్పటికీ ప్రముఖ మీడియా సంస్థ నుంచి మాత్రం కిమ్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని వార్తా కథనాలు వెలువడ్డాయి.

Also Read : వలసలకు చెక్ పెట్టనున్న ట్రంప్..

కానీ కిమ్ ఆరోగ్య పరిస్థితిపై అక్కడి అధికారుల మధ్య వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని స్థానిక మీడియా యెన్హాప్ వెల్లడించింది. అయితే వారు దక్షిణ కొరియా అధికారులా లేక ఉత్తర కొరియా అధికారులా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలింది. ఏప్రిల్ మొదటి వారంలో కిమ్ కు చేసిన సర్జరీ కారణంగానే ఆయనకు అస్వస్థత వచ్చిందన్న ఓ అమెరికా అధికారి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వెంటనే ఒక నిర్థారణకు రాలేమని దక్షిణ కొరియా యూనిఫికేషన్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Also Read : గాంధీ సూపరింటెండెంట్ మార్పు..

ఆయన చేసిన వ్యాఖ్యలకు కొన్ని ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. ఏప్రిల్ 11న చివరిగా ప్రజలకు కనిపించిన కిమ్ ఆ తర్వాత జరిగిన దేశ జాతి పిత కిమ్ 2 సంగ్‌కి సంబంధించిన డే ఆఫ్ ది సన్ వేడుకలకు హాజరవ్వలేదు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మార్చిలో ఉత్తర కొరియా నుంచి సత్సంబంధాలను కోరుతూ లేఖ రాయగా దానిని కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ తిరస్కరించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఉత్తర కొరియా అధ్యక్షుడికి సంబంధించి ఏదో రహస్యంగా జరుగుతుందని, అదేంటో తెలిసిన అధికారులు దానిని దాచేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే ఉత్తర కొరియా ఇంత వరకూ ఏ దేశానికీ తమ దేశం తరపున ఎలాంటి సహాయాన్ని ప్రకటించలేదు.

Also Read : కరోనా పై పోరుకు విప్రో భారీ విరాళం..అంతటితో ఆగకుండా..

Next Story