గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న శ్రావణ్ కుమార్ ను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. ఆ స్థానంలో ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఉన్న డా. రాజారావును నియమించింది. సోమవారం రాత్రి ఉత్తర్వులు వెలువడా..తక్షణమే బాధ్యతలు చేపట్టారు రాజారావు. శ్రావణ్ కుమార్ ను తెలంగాణ కరోనా కో ఆర్డినేటర్ గా విధించింది ప్రభుత్వం.

Also Read : చిట్యాల కరోనా సెల్ఫీ పాయింట్..

కాగా.. తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతున్న కొత్తలో గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ప్రశాంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని, పేషెంట్లను సరిగ్గా పట్టించుకోకపోగా చాలా అవకతవకలకు పాల్పడుతున్నారంటూ డాక్టర్ ప్రశాంత్ సూపరింటెండెంట్ శ్రావణ్ పై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్లుండి శ్రావణ్ కుమార్ ను గాంధీ విధుల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది.

Also Read : వాళ్లను చూసి నేర్చుకోండి : ఏపీ ప్రభుత్వంపై సోమిరెడ్డి సెటైర్లు

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.