మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం కనీస చర్యలు కూడా చేపట్టడం లేదని, మీకు చేతకాకపోతే పక్కరాష్ట్రం వారిని చూసైనా నేర్చుకోండంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను కరోనా నుంచి రక్షించేందుకు తీసుకుంటున్న చర్యలపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ మేరకు సోమిరెడ్డి ట్వీట్ చేశారు.

Also Read : వాట్సాప్ ద్వారా గ్యాస్ బుకింగ్..ఎలా చెయ్యాలో తెలుసుకోండి..

తెలంగాణ సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా కేబినెట్ మీటింగ్ నిర్వహించి సడలింపులు లేని లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు స్పష్టతిచ్చారు. పేదలకు సాయంలో ప్రత్యేక శ్రద్ధతోపాటు పంటల సేకరణకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. ఏపీలోనే అర్ధం కాని పరిస్థితి. కనీసం కేసీఆర్ నిర్ణయాలనైనా కాపీ, పేస్ట్ చేయండి. అని ఏపీ ప్రభుత్వానికి సలహాలిచ్చారు. కాగా..ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ సుదీర్ఘంగా జరిగిన తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువవుతుండటంతో మే 7వ తేదీ వరకూ ఎలాంటి సడలింపులు లేవని స్పష్టం చేశారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.