వలసలకు చెక్ పెట్టనున్న ట్రంప్..

By రాణి  Published on  21 April 2020 6:26 AM GMT
వలసలకు చెక్ పెట్టనున్న ట్రంప్..

అగ్రరాజ్యమైన అమెరికాలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ఒకరకంగా అక్కడ పరిస్థితి చేయిదాటిపోయింది. టెక్నాలజీలో ఎంతో ముందున్న అమెరికా సూది మొనంత కూడా లేని వైరస్ ను అదుపుచేయలేకపోతోంది. లాక్ డౌన్ ప్రకటిస్తే ఎక్కడ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందోనని క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది అమెరికా. కరోనా కారణంగా అక్కడ వివిధ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా కంపెనీలను మూసివేయడంతో నిరుద్యోగ సంక్షోభం పెరిగింది. అమెరికా పౌరులకే ఉద్యోగాలు నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు స్వయంగా వెల్లడించారు. దేశంలో విజృంభిస్తోన్న వైరస్ ఆటకట్టించేందుకై అమెరికాకు ఇతరదేశాల నుంచి వచ్చే వారికి చెక్ పెట్టనున్నారు. ఈ మేరకు మంగళవారం ఇమ్మిగ్రేషన్ కు చెక్ పెట్టే ఉత్తర్వులపై సంతకం చేయనున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం భారతీయులపై పెను ప్రభావం చూడనుంది.

Also Read : కేంద్రం రిపోర్ట్ : తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు ఎంత స‌మ‌యంలో రెట్టింపు అవుతున్నాయంటే..

తమ దేశ పౌరుల ఉద్యోగ భద్రతను రక్షించాల్సి ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పట్లేదని ట్రంప్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అందుకే ఇతర దేశాల నుంచి వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడప్పుడే భారతీయులు అమెరికాలో అడుగుపెట్టే అవకాశం లేదు. ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న భారత పౌరులు మరికొంతకాలం వేచి ఉండక తప్పదు.Next Story