ఈ భామ జుట్టు ఖ‌రీదు అక్ష‌రాలా 2.5 లక్షలు..!

By అంజి  Published on  26 Jan 2020 3:43 AM GMT
ఈ భామ జుట్టు ఖ‌రీదు అక్ష‌రాలా 2.5 లక్షలు..!

త‌మ అంద చందాల‌ను కెమెరా ముందు ప్ర‌ద‌ర్శించ‌డంలో ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌ని భామ‌లు సినీ ఇండ‌స్ట్రీలో చాలా త‌క్కువ మందే ఉంటారు. అటువంటి వారిలో నోరా ఫ‌తేహిదే మొద‌టి నెంబ‌ర్ అని చెప్పాలి. హీరోయిన్‌కు మించిన అంద చందాలు ఈ భామ సొంతం. డ్యాన్స్ త‌న ప్రొఫెస‌న్ క‌నుక ఇప్ప‌టికీ ఐటెమ్ సాంగ్స్‌లోనే కిర్రాక్ కిక్ ఇస్తుంటోంది. అందుకేనేమో ఈ పొడుగు కాళ్ల సుంద‌రికి యువ‌త‌లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.

పూరీ మేకింగ్‌లో వ‌చ్చిన టెంప‌ర్ చిత్రంలో ఇట్టాగే రెచ్చిపోదామంటూ సినీ జ‌నాల‌ను ఓ ఊపు ఊపేసింది. ఆ పాట‌తో మైకం నుంచి కుర్రాళ్లు బ‌య‌ట‌కు రాక ముందే బాహుబ‌లి చిత్రంతో మ‌ళ్లీ మెరిసింది. కేవ‌లం ప్ర‌భాస్‌తోనే కాకుండా మ‌నంద‌రితోనూ ప్ర‌పంచ‌ మ‌నోహ‌రీ తానేనంటూ పాడించేసింది. ఇదిలా ఉండ‌గా, తాజాగా నోరా ఫ‌తేహి కెమెరాకు ఇచ్చిన ఫోజులు, వీడియోలను చూసి అంద‌రూ షాకైపోతున్నారు. ఆ ఫోటోల్లో, వీడియోల్లో నోరా ఫ‌తేమి అంత అందంగా ఉంది మ‌రీ.

కాగా, నోరా ఫ‌తేహి న‌టించిన కొత్త చిత్రం స్ట్రీట్ డ్యాన్స‌ర్ -3. ఈ నెల 24న‌ విడుద‌లై మంచి టాక్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రంలో స‌మ్మ‌ర్ అనే లిరిక‌ల్ సాంగ్‌లో మెరిసిన నోరా ఫ‌తేగి కుర్ర‌కారుకు క‌నుల విందు చేసింద‌నే చెప్పాలి. ఆ పాట‌లో దుబాయ్‌లోని పోనీటైమ్ ఆచారం మాదిరి కేశాలంక‌ర‌ణ‌లో క‌నిపించింది. ఈ అలంక‌ర‌ణ‌కు దాదాపు రూ.2.5 ల‌క్ష‌లు ఖ‌ర్చైన‌ట్టు చిత్ర బృందం తెలిపింది. పొడ‌వాటి జుట్టుతో, బికినీని త‌ల‌పించే డ్ర‌స్‌తో నోరా ఫ‌తేహి వేసిన స్టెప్పులు త‌మ‌ను అల‌రించాయ‌న్నది యువ‌త నుంచి వినిపిస్తోన్న టాక్.

Next Story