ఢిల్లీ: ప్రముఖ ఆర్ధిక వేత్త, నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ ప్రధాని మోదీని కలిశారు. ప్రధాని మోదీతో అభిజిత్ కాసేపు భేటీ అయ్యి మాట్లాడారు. భేటీ కి సంబంధించిన వివరాలు, ఫొటోను మోదీ ట్విట్ చేశారు.

“ప్రముఖ ఆర్థిక వేత్తతో భేటీ చాలా బాగా జరిగింది. మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మానవ సాధికారికతపై ఆయనకు ఎంత తపన ఉందో అర్ధమైంది. అభిజిత్ సాధించిన విజయాలతో భారత్ గర్విస్తోంది”అంటూ మోదీ ట్విట్ చేశారు.

అయితే..కేంద్ర ప్రభుత్వంపై అభిజిత్ చాలా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆర్ధిక మందగమనంపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రభుత్వం ఉద్దీపన చర్యలు చేపట్టకపోతే ఫలితాలు ఘోరంగా ఉంటాయన్నారు. అయితే..దీనిపై కేంద్ర మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. పేదరిక నిర్మూనలను, ప్రతిపాదనలకు అభిజిత్‌కు నోబెల్ బహూమతి వచ్చిన సంగతి తెలిసిందే.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.