ముస్లింల హక్కులను ఎవరూ కాలరాయడం లేదు..!
By అంజి Published on 23 Dec 2019 4:18 PM ISTఅమరావతి: రాజకీయం కోసమే ప్రతిపక్షాలు సీఏఏపై అపోహలు సృష్టిస్తున్నాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. ముస్లింలకు తాను చేసిన మేలు.. మరే ముఖ్యమంత్రి ఇప్పటి వరకు చేయలదని భాస్కరరావు పేర్కొన్నారు. అపోహలతో ముందడుగు వేస్తోన్న భారతదేశం నష్టపోతోందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సైతం పౌరసత్వం ఇచ్చిన గొప్ప దేశం మనదని భాస్కర్‌రావు అన్నారు. ఈశాన్య రాష్ట్ర ప్రజలు సీఏఏ గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏలు ఏ వర్గానికి, మతానికి వ్యతిరేకం కాదని, దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టమని ఎవరు చెప్పడం లేదని నాదెండ్ల భాస్కరరావు వ్యాఖ్యనించారు. దేశంలో పదిహేను శాతం ఉన్న ముస్లింల హక్కులను ఎవరూ కాలరాయడం లేదని సృష్టం చేశారు. సీఏఏపై పార్లమెంట్‌లో అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగం అభ్యంతరకరంగా ఉందన్నారు. అల్లరు చేయడం దేశంలో కొందరికి అలవాటుగా మారిందని.. చొరబాటు దారులను అడ్డుకోవటానికే బీజేపీ సీఏఏ తీసుకొచ్చిందని నాదెండ్ల భాస్కరరావు అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పౌరసత్వ సవరణపై అనవసరం రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తమ రాష్ట్రాల్లో సీఏఏ అమలు చేయమని కొందరు ముఖ్యమంత్రులు అనడం సరైంది కాదన్నారు.