భవిష్యత్తులో టీడీపీతో కలిసే ప్రసక్తేలేదు - బీజేపీ ఎంపీ జీవీఎల్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Oct 2019 2:38 PM IST![భవిష్యత్తులో టీడీపీతో కలిసే ప్రసక్తేలేదు - బీజేపీ ఎంపీ జీవీఎల్ భవిష్యత్తులో టీడీపీతో కలిసే ప్రసక్తేలేదు - బీజేపీ ఎంపీ జీవీఎల్](https://telugu.newsmeter.in/wp-content/uploads/2019/10/gvl-mp.jpg)
విజయవాడ: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలుగుదేశంపార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు. బీజేపీతో విడిపోయి తప్పు చేశామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై జీవీఎల్ నరసింహారావు స్పందించారు. భవిష్యత్తుపై భయంతోనే చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారని జీవీఎల్ విశ్లేషించారు. టీడీపీతో భవిష్యత్తులో బీజేపీ ఎలాంటి పొత్తు పెట్టుకొదని జీవీఎల్ తేల్చిచెప్పారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటగా అధికారంలోకి వచ్చేది ఆంధ్రప్రదేశ్‌లోనని జీవీఎల్ జోష్యం చెప్పారు. ఓడిపోయిన నేతలు పార్టీలో చెరితే బలమెలా పెరుగుతుందన్నారు. భవిష్యత్తు కోసం ఓడిపోయిన నేతలు మాత్రం.. బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారని జీవీఎల్ అన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఒక శక్తిగా ఎదుగుతుందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చూపిస్తుందని జీవీఎల్ అన్నారు.
Next Story