హైదరాబాద్‌లో సిటీ బస్సులకు నో పర్మిషన్
By తోట వంశీ కుమార్ Published on 18 May 2020 3:17 PM GMTతెలంగాణలో బస్సు సర్వీసులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో రేపటి నుంచి బస్సు సర్వీసులు నడుస్తాయని, హైదరాబాద్‌లో మాత్రం సిటీ బస్సులు మాత్రం నడువవని సీఎం కేసీఆర్ చెప్పారు. కేభినేట్ మీటింగ్ అనంతరం కేసీఆర్ ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు నమోదవుతుండడం.. కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో సిటీలో బస్సు సర్వీసులు అనుమతించడం లేదన్నారు. మెట్రో సర్వీసులు సర్వీసులు కూడా పనిచేయవని, అయితే ఆటోలు, ట్యాక్సీలకు మాత్రం అనుమతిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు వందశాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చునని, పరిశ్రమలన్నింటికీ అనుమతి ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో సరిబేసి విధానంలో దుకాణాలు తెరవాలి. సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లకు అనుమతి లేదు. అన్ని రకాల విద్యాసంస్థల బంద్ కొనసాగుతుందని సీఎం వివరించారు. తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు.