ముఖ్యాంశాలు

  • పార్టీలో ఉండాలనుకుంటే ఉండు.. లేకపోతే లేదు: నితీశ్‌ కుమార్‌
  • అమిత్‌ షా ఫోన్‌ చేసి చెప్పాడు: బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌

బీహార్‌: ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు తన సొంత పార్టీ నుంచే భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. గత కొన్నాళ్లుగా జేడీయూలో ఉప్పు, నిప్పూగా ఉంటున్న ఆ పార్టీ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ బహిరంగ విమర్శలకు దిగారు. సీఏఏ, ఎన్‌ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా ప్రశాంత్‌ కిషోర్‌ కామెంట్లు చేశారు. దీంతో అధికార భాగస్వామి అయిన బీజేపీకి వ్యతిరేకంగా పీకే వ్యవహరిస్తోన్న తీరును బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ తీవ్రంగా తప్పుబట్టారు. కాగా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రశాంత్‌ కిషోర్‌ను జేడీయూ పార్టీ నుంచి పంపించడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

కాగా అమిత్‌ షా సూచన మేరకే పీకేని పార్టీ ఉపాధ్యక్ష పదవిలోకి తీసుకున్నామని నితీశ్‌ కుమార్‌ వెల్లడించి సంచలనం రేపారు. రాబోయే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద మొత్తంలో తమకు సీట్లు కేటాయిస్తేనే బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని ఇప్పటికే పీకే వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌ వాయిస్‌ మాట్లాడుతున్న పీకే తీరును అతన్ని ఇరకాటంలో పడేసేలా మారింది. సీఏఏపై మీ వైఖరి చెప్పాలని పీకే ప్రశ్నించడం.. నితీశ్‌ను ఆగ్రహానికి గురి చేసింది. మంగళవారం నాడు జేడీయూ పార్టీ సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం నితీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఎవరైనా పార్టీలో ఎంతకాలమైన ఉండవచని, ఇష్టం లేకపోతే వెళ్లవచ్చన్నారు. పీకే పార్టీలో ఉన్నా, లేకపోయినా ఫర్వాలేదన్నారు. మాది ఒకరకమైనా పార్టీ నితీశ్‌ వ్యాఖ్యనించారు.

అసలు తాను అమిత్‌షా చెబితేనే ప్రశాంత్‌ కిషోర్‌ను పార్టీలో చేర్చుకున్నారన్నారు. వెంటనే స్పందించిన ప్రశాంత్‌ కిషోర్‌.. ఎన్ని అబద్దాలు..? మీరు అమిత్‌షాకు లొంగిపోయారని, ఆయన ముందు తలవంచుకున్నారు కదా అని నితీశ్‌ కుమార్‌పై పీకే ఎదురువ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రశాంత్‌ కిషోర్ ఆమ్‌ఆద్మీపార్టీ తరఫున తన ఎన్నికల గెలుపు వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో నితీశ్‌ చేతుల కలిపారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.