అనుష్క 'నిశ్శబ్దం' ట్రైలర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sept 2020 1:55 PM IST
అనుష్క నిశ్శబ్దం ట్రైలర్‌

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి, మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. థ్రిల్లర్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పట్లో థియేటర్లు ప్రారంభం అయ్యే పరిస్థితులు లేకపోవడంతో అమెజాన్‌ ప్రైమ్‌లో అక్టోబర్‌ 2 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. కాగా.. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ ను హీరో నారా విడుదల చేశారు.

అనుష్క మూగ పెయింటర్‌ పాత్రలో నటిస్తోంది. సోనాలి అనే యువతి కనిపించకుండా పోవడానికి కారణం ఏంటీ..? సాక్షి (అనుష్క), ఆంటోని(మాధవన్‌) లు ఎవరు..? వారికి సోనాలికీ సంబంధం ఏంటీ..? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తెలుగులో నిశ్శబ్దం, తమిళ, మలయాళ భాషల్లో సైలెన్స్‌ అనే పేరుతో సినిమాను విడుదల చేస్తున్నారు. అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, కోన వెంకట్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించారు.

Also Read

Next Story