బడ్జెట్‌ ప్రసంగంలో ఆసక్తికర కవితను వినిపించిన మంత్రి నిర్మలా సీతారామన్‌

By సుభాష్  Published on  1 Feb 2020 7:12 AM GMT
బడ్జెట్‌ ప్రసంగంలో ఆసక్తికర కవితను వినిపించిన మంత్రి నిర్మలా సీతారామన్‌

పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా శనివారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి, దివంగత అరుణ్‌ జైట్లీ గుర్తు చేసుకున్నారు. జీఎస్టీ తీసుకురావడానికి జైట్లీ ఎంతగానో కృషి చేశారని చెప్పారు. ఈ బడ్జెట్‌లో సామాన్యులకు, రైతులకు మేలు జరిగే విధంగా ఉంటుందని చెప్పారు. ఇక శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరుగుతుందని, న్యూ ఇండియా, సబ్‌కాసాత్‌..సబ్‌కావికాస్‌, ప్రజాసంక్షేమం .. లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో బడ్జెట్‌ ఇది. గతంలో మాదిరిగానే నిర్మలా సీతారామన్‌ ఈ సారి కూడా ఎర్రనీ వస్త్రంతో కూడిన బడ్జెట్‌ ప్రతులను సమావేశాలకు వచ్చారు. ఇలా బడ్జెట్‌ గురించి వివరిస్తూ.. మధ్యలో ఓ కవితను చదివి వినిపించారు మంత్రి.

''నా దేశం దాల్‌ సరస్సులో విరబూసిన కమలం లాంటిది

మానవత్వం, దయతో కూడిన సమాజం ఎంతో అవసరం

నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం

మా దేశం వికసిస్తున్న షాలిమార్‌ తోట లాంటిది'' అని అన్నారు.

Next Story