ఆర్ధిక రంగ పతనానికి బీజేపీ కారణం – రాహుల్ గాంధీ

ఢిల్లీ: దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సక్షోభంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధికమాంద్యాన్ని అధిగమించేందుకు ఎన్ డీఏ ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికలు చేపట్టడం లేదంటూ విమర్శిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

పతనమౌతున్న ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిందిపోయి పసలేని సిద్ధాంతాలను తెరమీదకు తెస్తున్నారని మండిపడ్డారు.  వాస్తవాలను కప్పిపుచ్చడానికి  దేశ ప్రజలను మభ్య పెడుతున్నారంటూ  నిర్మలాసీతారామన్ పై రాహుల్ మండిపడ్డారు.

ఆటోమొబైల్ రంగం కుదేలవ్వడానికి ఓలా, ఊబర్ సంస్థలే కారణం అనడాన్ని రాహుల్ తప్పుబట్టారు.

దేశాన్ని చుట్టు ముట్టిన ఆర్ధిక విపత్తును ప్రభుత్వం గుర్తించలేదన్నారు. సమస్యను ప్రతిపక్షమే గుర్తించిందన్నారు.   పరిష్కారానికి ఇదే సరైన సమయమంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫొటోను రాహుల్ గాంధీ పోస్ట్ చేసారు.

దేశ ఆర్థిక రంగ పతనానికి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ప్రధాన కారణమంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ వాణిజ్య పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రచురించిన వెబ్ లింక్ ను రాహుల్ గాంధీ షేర్ చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.