నిర్భయ కేసులో తీర్పు రిజర్వ్‌.. అప్పుడే ఉరిశిక్ష.!

By అంజి  Published on  2 Feb 2020 3:16 PM GMT
నిర్భయ కేసులో తీర్పు రిజర్వ్‌.. అప్పుడే ఉరిశిక్ష.!

ఢిల్లీ: నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ఆదివారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దోషుల ఉరిశిక్షపై పటియాల కోర్టు స్టే ఇవ్వాడాన్ని సవాల్‌ చేస్తూ కేంద్రం పిటిషన్‌ దాఖలు చేసింది. నిందితులు దేశ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని కేంద్రం కోర్టుకు తెలిపింది. కాగా వాదనలు ముగియడంతో తీర్పును కోర్టు రిజర్వ్‌ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ దోషుల ఉరి నిలపివేయనున్నారు. కాగా క్షమాభిక్ష పిటిషన్‌, క్యూరేటివ్‌ పిటిషన్‌లతో దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు. దీంతో దోషుల ఉరి శిక్ష అమలు వాయిదాల పర్వం సాగుతోంది.

నిర్భయ కేసులో నలుగురు నిందితుల ఉరి శిక్ష పై ఢిల్లీ పటియాల కోర్టు స్టే అందరికీ షాక్ ఇచ్చింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలవుతుందన్న ఆనందాన్ని అణచివేసింది. ఇప్పటికి నాలుగు సార్లు నిందితులకు ఉరిశిక్ష వాయిదా పడింది. కాగా..కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంక వరకూ ఉరిశిక్ష వాయిదా వేయాల్సిందిగా పటియాలా కోర్టు తెలిపింది. వినయ్ శర్మ క్షమాభిక్ష కోరుతూ రాష్ర్టపతికి చేసిన మెర్సీ పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉండటం వల్ల శిక్షను వాయిదా వేశారా ? లేక మరో వారం రోజుల్లో ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఉరిశిక్షను వాయిదా వేశారా ? ఇలా పిటిషన్లు వేయించి, శిక్షను వాయిదా వేస్తూ…నిందితులకు ఉరిశిక్ష పడకుండా చేసి…కేసు నుంచి బయటకు తెచ్చేందుకే ఈ హైడ్రామానా ? అని ఎన్నో అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఉరిశిక్ష సమయం దగ్గరపడుతున్నా నిందితుల్లో అణువంతైనా భయం లేదని జైలు అధికారులు చెప్పిన మాటలే నిజమయ్యాయి.

Next Story