నిర్భయ దోషులకు ఉరితీసే సమయం దగ్గరపడుతోంది. మరో నాలుగు రోజుల్లో ఉరిశిక్ష పడనుంది. ఉరి శిక్ష అమలుకు తీహార్‌ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో కొత్త ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. ఉరిశిక్షను వాయిదా వేసేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ, ఇన్నీ కావు. తాజాగా దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ వేశాడు. తన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోర్టును అభ్యర్థించాడు.

కాగా, మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు నలుగురు దోషులకు తీహార్‌ జైల్లో ఉరితీయనున్నారు. నలుగురు దోషులైన పవన్‌ గుప్తా, అక్షయ్‌ కుమార్‌, వినయ్‌శర్మ, ముకేష్‌ సింగ్‌లకు ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయనున్నారు. దోషులు శిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని చట్టాలను ఉపయోగించుకోవడంతో రెండుసార్లు ఉరిశిక్ష వాయిదా పడింది. మరో నాలుగు రోజుల్లో ఉరిశిక్ష అమలు కానుండగా, శుక్రవారం సుప్రీం కోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు పవన్‌ గుప్తా. మరి ఈ పిటిషన్‌పై కోర్టు శిక్షను వాయిదా వేస్తుందా..? లేక శిక్ష అమలు చేస్తుందా వేచి చూడాలి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.