దేశ వ్యాప్తంగా ఢిల్లీలో సంచలన సృష్టించిన నిర్భయ కేసుకు నేటితో ఏడేళ్లు అయింది. 2012, డిసెంబర్‌ 16న ఓ విద్యార్థిపై కదులుతున్నబస్సులు ఆరుగురు నీచులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను సింగపూర్‌ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా, చివరకు కన్నుమూసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెకు నిర్భయగా నామకరణం చేశారు. ఈ ఘటనలో నిందితులైన, వినయ్‌, రామ్‌ సింగ్‌, అక్షయ్‌కుమార్‌, పవన్‌, ముఖేష్‌, మరో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని తీహార్‌ జైలుకు తరలించగా, 2013లో ఓ నిందితుడు జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో నిందితుడు మైనర్‌గా భావించి మూడు సంతవ్సరాలపాటుజైలు శిక్ష విధించి విడుదల చేశారు. కేసు విచారించిన కోర్టు, కాగా మిగిలిన నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. కాగా, ఈ తీర్పును సవాల్‌ చేస్తూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి 2017 మే 5న హైకోర్టు విధించిన ఉరి శిక్షనే సమర్ధించింది. చివరి ప్రయత్నంగా నిందితులు రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ అటువంటి మృగాళ్లను కనికరించవద్దని ఢిల్లీ ప్రభుత్వం ప్రెసిడెంట్‌ను అభ్యర్థించింది. దీంతో రాష్ట్రపతి కోవింద్ కూడా క్షమాభిక్ష పిటీషన్‌ను తిరస్కరించడంతో ఉరిశిక్ష ఖరారు అయినట్లు తెలుస్తోంది. కానీ.. ఇంతవరకూ దానిపై క్లారిటీ రాలేదు. నిర్భయ తల్లిదండ్రులు ఈ  ఘటనపై ఏడేళ్లు పోరాటం చేస్తున్నా.. తమకు న్యాయం ఇంత వరకు జరగలేదని ఆవేదన వెళ్లబోసుకుంటున్నారు.

కాగా, వీరికి ఉరిశిక్ష ఖరారు చేసి దాదాపు రెండేళ్లు అయినా ఇప్పటి వరకు ఉరి తీయలేదు.  ఈ ఘటనపై అప్పట్లో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులకు వెంటనే ఉరి శిక్ష వేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకే ఎన్నో విచారణలో, ఎన్నో  పిటిషన్లను విచారించింది సుప్రీం కోర్టు. ఇటీవల ఈనెలలోనే ఉరిశిక్షనువేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు తీహార్‌ జైలు ప్రకటించారు. వారిని ఉరితీసేందుకు ఉరితాళ్లను కూడా బీహార్‌లోని బక్సర్‌ సెంట్రల్‌ జైలు ఖైదీలు తయారు చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

భద్రత విషయంలో

నిర్భయపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిన తర్వాత మహిళల భద్రత విషయంలో చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. కానీ నాటికీ నేటికీ ఇక్కడ ఏమాత్రం మార్పురాలేదని మహిళలు ఆరోపిస్తున్నారు. సీసీటీవీలు ఏర్పాటు చేస్తామని, బస్సుల్లో జీపీఎస్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అయినప్పటికీ మునిర్కా బస్టాప్‌ వద్ద ఆకతాయిలు మమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.