నిర్భయ దోషులు ఇప్పటి వరకు ఏఏ పిటిషన్లు దాఖలు చేశారో తెలుసా..?
By సుభాష్Published on : 2 March 2020 3:34 PM IST

2012, డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయపై జరిగిన అత్యాచారం కేసులో దోషులకు రేపు ఉరిశిక్ష పడనుంది. దోషులు వివిధ పిటిషన్లు దరఖాస్తు చేసుకున్న కారణంగా ఇప్పటికి శిక్ష రెండుసార్లు వాయిదా పడింది. దోషుల్లో ఒకడు రాష్ట్రపతికి క్షమాభిక్ష పటిషన్ పెట్టుకోగా, దానిని రాష్టపతి తిరస్కరించారు. అలాగే పవన్ గుప్తా క్యూరిటీవ్ పిటిషన్‌ను దరఖాస్తు చేసుకోగా, ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు తిరస్కరించింది. దోషులకు మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష విధించాల్సిందేనంటూ స్పష్టం చేసింది. కాగా, నలుగురు దోషులు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న పిటిషన్లను అటు రాష్ట్రపతిగానీ, ఇటు కోర్టు గాని తిరస్కరించింది. శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే దోషులు ఏఏ పిటిషన్లు దాఖలు చేశారో ఓసారి చూద్దాం.
అక్షయ్ ఠాకూర్
రివ్యూ పిటిషన్ | తిరస్కరణ
|
క్యూరిటీవ్ పిటిషన్ | తిరస్కరణ
|
క్షమాభిక్ష పిటిషన్ | తిరస్కరణ |
ముఖేష్ సింగ్
రివ్యూ పిటిషన్ | తిరస్కరణ
|
క్యూరిటీవ్ పిటిషన్ | తిరస్కరణ
|
క్షమాభిక్ష పిటిషన్ | తిరస్కరణ |
వినయ్ శర్మ
రివ్యూ పిటిషన్ | తిరస్కరణ
|
క్యూరిటీవ్ పిటిషన్ | తిరస్కరణ
|
క్షమాభిక్ష పిటిషన్ | తిరస్కరణ |
పవన్ గుప్తా
రివ్యూ పిటిషన్ | తిరస్కరణ
|
క్యూరిటీవ్ పిటిషన్ | తిరస్కరణ
|
క్షమాభిక్ష పిటిషన్ | వేయలేదు |
Next Story