ఏపీ కొత్త సీఎస్ బాధ్యతల స్వీకరణ.!
By Medi Samrat Published on 14 Nov 2019 3:37 PM ISTఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి(సీఎస్)గా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంఛార్జ్ సీఎస్‌గా ఉన్న నీరబ్‌కుమార్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. దీంతో నవ్యాంధ్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని రికార్డులకెక్కారు. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె.. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాజిల్లా అసిస్టెం ట్ కలెక్టర్‌గా, నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
అనంతరం.. కేంద్ర సర్వీసులకు వెళ్లి గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత ఏపీఐడీసీ వీసీ అండ్ ఎండీగా ఉన్నారు. అనంతరం స్త్రీ శిశుసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.
Next Story