మనోహర పాటకి మైమరపిస్తున్న నిహారిక డ్యాన్స్
By తోట వంశీ కుమార్ Published on 1 May 2020 6:11 PM ISTలాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ వాయిదా పడడంతో మెగా వారసురాలు నిహారిక ఇంటికే పరిమితం అయ్యారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక.. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ యశ్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను అభిమానులతో పంచుకుంది. చెలి సినిమాలోని మనోహార అనే రొమాంటిక్ పాటకు సంబందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుండగా.. అందుకు తగ్గట్టు వీరిద్దరు కాలు కదపడం చూపరులను ఆకట్టుకుంది. ఈ పాటలో వీరిద్దరు పోటా పోటిగా డ్యాన్స్ చేశారు.
'ముద్ద పప్పు ఆవకాయ' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిహారిక. ఆ తరువాత 'ఒక మనసు' చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరపై అరగ్రేటం చేసింది. ఆ తరువాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి చిత్రాల్లో నటించింది. అయితే.. ఆ చిత్రాలు ఆశించినంత మేరకు విజయం సాధించలేకపోయాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన నిహారిక.. తాజాగా ఆచార్య సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. తమిళంలో త్వరలో రొమాంటిక్ జోనర్‌లో ఓ చిత్రం చేయనుంది.