జూనియ‌ర్ రాఖీ భాయ్‌ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన య‌శ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2020 5:51 AM GMT
జూనియ‌ర్ రాఖీ భాయ్‌ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన య‌శ్‌

'కేజీఎఫ్' చిత్రంతో దేశ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు య‌ష్‌. ప్ర‌స్తుతం ఆయ‌న 'కేజీఎఫ్‌-2' చిత్రంతో న‌టిస్తున్నారు. కాగా.. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో.. ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు ఈ క‌న్న‌డ స్టార్ హీరో. షూటింగ్‌లు ఉన్నా లేక‌పోయినా.. ఎప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు య‌ష్‌. త‌న‌ ఫ్యామిలీ సంబంధించిన ఫోటోల‌తో పాటు చిత్ర విశేషాల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంటాడు. తాజాగా ఈ స్టార్ హీరో త‌న కుమారుడి షోటోని షేర్ చేశాడు.

య‌శ్‌, రాధికా పండింట్ ను 2016లో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరికి ఓ కూతురు, ఓ కొడుకు ఉన్నారు. అక్టోబ‌ర్ 30, 2019లో వీరికి ఓ కుమారుడు జ‌న్మించ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు కొడుకు ఫోటోని రివీల్ చేయ‌లేదు. తాజాగా కుమారుడి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు య‌శ్‌. "చిన్నారికి హాయ్ చెప్పండి.. మీ అంద‌రి ప్రేమ‌, ఆశీర్వాదాలు అత‌డికి అందించండి" అంటూ ఆఫోటో కింద రాసుకొచ్చాడు య‌శ్‌. ప్ర‌స్తుతం నెటింట్లో ఈ ఫోటో వైర‌ల్ గా మారింది. జూనియ‌ర్ రాఖీ భాయ్ అంటూ అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Next Story