ఎమ్మెల్యే హత్య కేసులో 33 మంది మావోలపై చార్జిషీట్ దాఖలు
By సుభాష్ Published on 2 Oct 2020 9:28 AM GMTఛత్తీస్‌గఢ్‌లో 2019లో జరిగిన ఎమ్మెల్యే భూమా మాండవి హత్యకు సంబంధించి మావోయిస్టుకు చెందిన 33 మంది క్యాడర్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్(ఎన్‌ఐఏ) చార్జీషీట్ దాఖలు చేసింది. భారతీయ శిక్షాస్మృతి, చట్ట విరుద్ద కార్యకలాపాలు చట్టం, ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద జగదల్‌పూర్‌లోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టులో గురువారం ఈ చార్జిషీట్ దాఖలైంది. 33 మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్టు చేయగా, 22 మంది ఇంకా పరారీలో ఉన్నారు. మరో ఐదుగురు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు.
దంతేవాడకు చెందిన మద్కారామ్ తాతి, భీమా రామ్ తాతి,లింగే తాతి, లక్ష్మణ్ జైస్వాల్, రమేష్ కుమార్, కశ్యప్, హరిపాల్‌సింగ్ చౌహాన్‌లను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ ప్రతినిధి పేర్కొన్నారు. కాగా, 20109 ఏప్రిల్ 9న దంతేవాడ జిల్లాలోని శ్యామ్‌గిరి గ్రామ సమీపంలో మావోయిస్టులు ఐఈడీ పేల్చి, విచాక్షణారహితంగా కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో దంతేవాడ అప్పటి ఎమ్మెల్యే ఢబీమా మాండవితో మరో నలుగురు పోలీసు సిబ్బంది మృతి చెందారు. హతమార్చిన అనంతరం భద్రతా సిబ్బంది ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని మావోయిస్టులు అపహరించుకుపోయారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది.