కారులో నవదంపతులు.. సగానికి పైగా మునిగిపోయిన కారు.. ఇంతలో..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Jun 2020 10:55 AM GMT
కారులో నవదంపతులు.. సగానికి పైగా మునిగిపోయిన కారు.. ఇంతలో..!

ఝార్ఖండ్: ఝార్ఖండ్ లోని పలము జిల్లాలో ఓ కారు నీటిలో మునిగిపోయింది. అందులో నూతన దంపతులతో పాటూ.. మరో ముగ్గురు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే నీటి లోకి దూకారు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

పెళ్లి పూర్తీ అవ్వగానే పెళ్లికొడుకు, కుమార్తె కలిసి కారులో పెళ్లికొడుకు గ్రామానికి బయలుదేరారు. ఆ కారులో వారిద్దరితో పాటూ మరో ముగ్గురు కూడా ఉన్నారు. మలయ్ నది మీద ఉన్న బ్రిడ్జి మీద నుండి వెళుతుండగా నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కారు బ్రిడ్జి నుండి అదుపు తప్పి నదిలో కొట్టుకుపోవడం మొదలైంది. అలా దాదాపు అర కిలోమీటర్ నదిలో కారు వెళ్ళిపోయింది. అప్పటికే సగం కారులోకి నీళ్లు వచ్చేసాయి. ఇంతలో ఆ కారును చూసిన స్థానికులు వెంటనే స్పందించారు.

నీటిలోకి దూకిన స్థానికులు వెంటనే కారు అద్దాలను పగులగొట్టి లోపల ఉన్న వాళ్లను బయటకు తీసుకుని వచ్చారు. ఓ సినిమా సీన్ లాగా తలపించిన ఈ ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రంలో ఆదివారం నాడు భారీ వర్షం కురిసింది. దీంతో పలు నదులలోకి నీళ్లు వచ్చి చేరాయి.

Next Story
Share it