ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. వారికి కరోనా పాజిటివ్‌.. తల్లిదండ్రులకు నెగిటివ్‌

By సుభాష్  Published on  27 Jun 2020 10:22 AM IST
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. వారికి కరోనా పాజిటివ్‌.. తల్లిదండ్రులకు నెగిటివ్‌

ముఖ్యాంశాలు

  • ఒకే కాన్పులో ముగ్గురు జననం

  • పిల్లలకు కరోనా పాజిటివ్‌.. తల్లిదండ్రులకు నెగిటివ్‌

  • ఆశ్చర్యపోతున్న వైద్యులు

  • లోతుగా పరిశోధన చేస్తున్న వైద్య బృందం

  • ఈ అంశాన్ని త్వరలో తేలుస్తామంటున్న వైద్యులు

కరోనా వైరస్‌..ఈ పేరు వింటేనే గుండెల్లో దడ పుట్టేస్తుంటుంది. శత్రువు ఎదురొచ్చినా బయపడకున్న కరోనా అంటేనే వణికిపోవాల్సిందే. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి చాపకింద నీరులా దాదాపు 200లకుపైగా దేశాలకు చాపకింద నీరులా విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పాజిటివ్‌ కేసులు, మరణాలతో దేశాలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది.

ఇక తాజాగా మెక్సికోలో ఒక కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. అయితే ముగ్గురు శిశువులకు కరోనా పాజిటివ్‌ రాగా, తల్లిదండ్రులిద్దరికి మాత్రం నెగిటివ్‌ రావడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఈ ముగ్గురు కూడా జూన్‌ 17వ తేదీన సెంట్రల్‌ మెక్సికన్‌ రాష్ట్రంలో శాన్‌ లూయిస్‌ పోటోస్‌లో జన్మించారు. వారు జన్మించిన నాలుగు గంటల తర్వాత వారికి పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఈ పరీక్షల్లో పిల్లలకు పాజిటివ్‌ వచ్చి, తల్లిదండ్రులిద్దరికి నెగిటివ్‌ వచ్చిందని మెక్సికన్‌ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 'ముగ్గురు పిల్లలు స్థిరంగా అభివృద్ధి చెందుతున్నారు' అని పోటోస్‌ ఆరోగ్య కార్యదర్శి మోనికా రాంగెల్‌ మీడియాకు తెలిపారు. అయితే తల్లి గర్భంలో పిల్లలకు కరోనా ఎలా సోకింది.. తల్లికి నెగిటివ్‌ ఎలా వచ్చింది.. మరి పుట్టిన తర్వాత సోకిందా .. అనే తదితర కారణాలను అన్వేషిస్తున్నారు వైద్యులు.

కరోనా ఎలా సోకిందనే విషయం ఇప్పుడే చెప్పలేం:

కాగా, ఒక కాన్పులో ముగ్గురు జన్మించిన పిల్లలకు కరోనా పాజిటివ్‌ రావడం, తల్లికి నెగిటివ్‌ రావడం అనే విషయపై ఇప్పుడికిప్పుడే ఏం చెప్పలేమని, దీనిపై తెలుసుకోవాల్సిన కారణాలు చాలా ఉన్నాయని, ఈ అంశంపై అంతర్జాతీయంగా రీసెర్చ్‌ జరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. పూర్తి సమాచారం అందుబాటులో లేదని, దీనిపై లోతుగా సమీక్షిస్తున్నట్లు చెప్పారు.

తల్లిదండ్రులిద్దరికి కరోనా నెగిటివ్‌ వచ్చింది

ఈ అంశంపై ఆశ్చర్యం కలిగించే విషయమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండులిద్దరికి పిసిఆర్‌ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిందని ఆరోగ్య కార్యదర్శి మోనికా రాంగెల్‌ తెలిపారు. గర్భధారణ సమయంలో కోవిడ్‌-19 తల్లి నుంచి పిల్లలకు ఎలా వ్యాపించింది..? లేదా పుట్టిన తర్వాత ఇతర సంరక్షకుల నుంచి లేదా, వారి తల్లి నుంచి శివువులకు సోకి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై పూర్తి వివరాలు త్వరలో తేలుస్తామని చెబుతున్నారు ఆయన వివరించారు.

Next Story