హమ్మయ్యా.. కివీస్‌ క్రికెటర్‌కు కరోనా లేదు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 March 2020 10:09 AM IST
హమ్మయ్యా.. కివీస్‌ క్రికెటర్‌కు కరోనా లేదు..

న్యూజిలాండ్‌ జట్టు ఊపిరి పీల్చుకుంది. ఆ జట్టు ఆటగాడు పేసర్‌ లాకీ ఫెర్గూసన్‌ కి కరోనా వైరస్‌ లేదని తేలింది. దీంతో త్వరలోనే అతడు కివీస్‌కి వస్తాడని బ్లాక్‌ క్యాప్స్‌ ట్వీట్‌ చేసింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తొలి వన్డే అనంతరం తనకు గొంతు నొప్పి ఉందని ఫెర్గూసన్‌ చెప్పడంతో అతడికి వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించారు. శనివారం వచ్చిన ఫలితాల్లో కరోనా లేదని తేలడంతో అతడు న్యూజిలాండ్‌ వెళ్లడానికి మార్గం సుగమం అయింది. 'ఇంటికొస్తున్నాడు లాకీ ఫెర్గూసన్‌ విమాన ప్రయాణం చేసేందుకు అనుమతి లభించింది. ఆదివారం న్యూజిలాండ్‌కు వస్తాడు' అని కివీస్‌ బోర్డు ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసింది. ఇంతకముందు ఆసీస్‌ క్రికెటర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌ సైతం గొంతునొప్పిని చెప్పడంతో.. కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగటీవ్‌ అని వచ్చింది.



Next Story