స్మగ్లర్స్‌ కొత్త మార్గాలు.. పేస్ట్‌ రూపంలో గోల్డ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2019 10:25 AM GMT
స్మగ్లర్స్‌ కొత్త మార్గాలు.. పేస్ట్‌ రూపంలో గోల్డ్‌

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 724 గ్రాముల బంగారం పెస్ట్‌ ఓ వ్యక్తి వద్ద పట్టుబడింది. డైరేక్టరేట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ముంబై నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌ ఇండియా విమానంలో వచ్చిన వ్యక్తిపై అనుమానం రావడంతో తనిఖీలు నిర్వహించారు. బంగారం పేస్ట్‌ను ఎలిప్టికల్‌ బ్లాక్‌ కలర్‌ అంటుకునే టేపుతో చుట్టి ఉన్న మూడు బంతులను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 832 గ్రాముల బరువున్న పేస్ట్‌ బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు పరీక్షించారు.

Gold Paste2 Gold Paste3

ఈ క్రమంలో పేస్ట్‌ రూపంలో ఉన్న రూ.27.87 లక్షల విలువగల బంగారం 724 గ్రాముల బంగారంగా తేలింది. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారుల విచారణలో ప్రయాణికుడు ఒప్పుకున్నాడు. బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసిన వ్యక్తిపై కస్టమ్స్‌ యాక్ట్‌, 1962 కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అనంతరం డీఆర్‌ఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Gold Paste 4 Gold Paste 5

Next Story