సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..
By తోట వంశీ కుమార్ Published on 9 Sept 2020 5:39 PM ISTసీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శ్రావణి చావుకు సాయి అనే వ్యక్తి కారణం అని దేవ్‌రాజ్ రెడ్డి వెల్లడించాడు. సాయి అనే వ్యక్తి శ్రావణిని తన ముందే చంపాలని చూశాడని, సాయి అనే వ్యక్తి పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై ఒత్తిడి తెచ్చాడని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాడనే భయంతో శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజు తెలిపాడు. శ్రావణి కాల్ రికార్డింగ్ క్లిప్స్ పోలీసుల ముందుంచుతానని, తల్లిదండ్రుల ఒత్తిడితోనే శ్రావణి తనపై కేసు పెట్టిందని తెలిపాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పెళ్లి చేసుకోమని అడిగిందని, తాను ఒప్పుకోకపోయేసరికి తనపై ఆరోపణలు చేస్తున్నారని, తనపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటానని శ్రావణి తనతో చెప్పిందని దేవరాజు తెలిపాడు.
సెప్టెంబర్ 7వ తేదీన శ్రావణితో కలిసి డిన్నర్‌కు వెళ్లాలన్న దేవరాజ్.. అక్కడికి సాయి అనే వ్యక్తి వచ్చి ఆమెపై చేయి చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. సుమారు 5 సంవత్సరాలుగా సాయితో శ్రావణికి పరిచయం ఉందన్నాడు. అంతేకాకుండా తాను శ్రావణికి సంవత్సరం క్రితమే పరిచయం అయ్యానని దేవరాజ్ తెలిపాడు. సాయి, శ్రావణి కుటుంబసభ్యులు ఆమెను కొట్టి హింసించేవారన్నాడు. గత ఎనిమిది సంవత్సరాల నుండి శ్రావణి టీవీ సీరియల్స్ లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె మౌన రాగం, మనసుమమత తో పాటు పలు సీరియల్స్‌ల్లో నటిస్తోంది.
ఇక శ్రావణి ఆత్మహత్యకు టిక్‌టాక్‌లో పరిచయమైన కాకినాడకు చెందిన దేవరాజ్ రెడ్డి కారణం అని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా శ్రావణిని దేవరాజ్ వేదిస్తున్నట్లు తెలిపారు. శ్రావణి వల్లే దేవ్‌రాజ్‌కు పలు సీరియల్స్‌లో నటించే అవకాశం వచ్చిందన్నారు. గతంలో ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.