తెలంగాణలో మరో రెవెన్యూ డివిజన్

By సుభాష్  Published on  17 July 2020 7:26 AM IST
తెలంగాణలో మరో రెవెన్యూ డివిజన్

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోఆరు మండలాలతో కొత్తగా వేములవాడ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కొత్త డివిజన్‌తో వేములవాడ, వేములవాడ రూరల్‌, రుద్రంగి, చందుర్తి, బోయిన్‌పల్లి, కోనారావుపేట మండలాలు ఈ డివిజన్‌ పరిధిలోకి రానున్నాయి. కొత్త రెవెన్యూ డివిజన్‌కు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 71 రెవెన్యూ డివిజన్లు ఉండగా, తాజాగా వేములవాడ రెవెన్యూ డివిజన్‌తో వీటి సంఖ్య 72కు చేరనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వేములవాడ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story