కరోనా నుంచి కోలుకున్నాక కూడా కొన్ని లక్షణాలుంటాయ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sep 2020 7:56 AM GMT
కరోనా నుంచి కోలుకున్నాక కూడా కొన్ని లక్షణాలుంటాయ్‌

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనాసగుతోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరిగుతూనే ఉన్నాయి. కరోనా బాధితుల విషయంలో కేంద్రం తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్‌-19 నుంచి కోలుకున్నప్పటికి కొన్ని రోజుల పాటు కొన్ని లక్షణాలు ఉంటాయని చెప్పింది. ఒళ్లు నొప్పులు, అలసట, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాక వెల్లడించింది. ఈ విషయంలో బాధితులు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పింది.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కోలుకోవడానికి కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం కూడా వ్యాయామం చేయాలని, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు పోషకాహాన్ని ఖచ్చితంగా తీసుకోవాలని సూచించింది. బాధితులు గుండె పని తీరుతో పాటు రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిని పరీక్షించుకోవాలని తెలిపింది. కరోనా వచ్చిన సమయంలో, రాకముందు మాస్క్‌ ధరించినట్లే అనంతరం కూడా ఆ పని చేయాలని, శానిటైజర్‌ వాడాలని, సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పింది. అలాగే, హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తీవ్రతరమైతే ఆలస్యం చేయొద్దని, వైద్యులను సంప్రదించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.

Next Story