ఎస్‌బీఐ మరో ముందడుగు.. ఖాతాదారులకు శుభవార్త

By సుభాష్  Published on  4 Sep 2020 9:13 AM GMT
ఎస్‌బీఐ మరో ముందడుగు.. ఖాతాదారులకు శుభవార్త

ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద సంస్థ ఎస్‌బీఐ. తమ ఖాతాదారుల భద్రత కోసం ఎస్‌బీఐ మరో ముందడుగు వేసింది. బ్యాంకులకు సంబంధించిన విషయాల్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. వినియోగదారుల ఖాతాలకు సంబంధించి, ఏటీఎంల విషయాల్లో ఎన్నో మోసాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఎస్‌బీఐ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ఏటీఎంతో బ్యాలెన్స్‌, మినీ స్టేట్‌మెంట్‌ ఎంక్వైరీ చేసిన ప్రతిసారి రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఓ మెసేజ్‌ పండటం ద్వారా ఖాతాదారులను అప్రమత్తం చేయనుంది. ఈ మెసేజ్‌ అలర్ట్‌ కారణంగా ఒక వేళ అనధికార లావాదేవీ జరుగుతున్నట్లయితే ఖాతాదారుడు వెంటనే స్పందించి తన ఏటీఎమ్‌ కార్డును బ్లాక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ విధానం వల్ల ఏటీఎం మోసాలను అరికట్టవచ్చని భావించిన భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన వివరాలను ఎస్‌బీఐ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించింది. బ్యాలన్స్‌, మినీ స్టేట్‌మెంట్ వివరాలకు సంబంధించి ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ లను నిర్లక్ష్యం చేయవద్దని ఎస్‌బీఐ తెలిపింది. అనధికారిక లావాదేవీ జరుగుతున్నట్లయితే వెంటనే ఏటీఎమ్‌ను బ్లాక్‌ చేయాలని సూచించింది.

కాగా, ఎస్‌బీఐ ఇలాంటి అనేక ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్స్‌ ని కస్టమర్లకు అందిస్తోంది. ఆన్‌లైన్‌ సెఫ్టీ టిప్స్‌ అందిస్తూ కస్టమర్లను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉంటుంది. ఇటీవలే 10 సేఫ్టీ టిప్స్‌ని విరించింది. వీటి వల్ల సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండేందుకు కస్టమర్లను అప్రమత్తం చేస్తూ ఉంటుంది.



Next Story