సీఎంపై నెటిజన్‌ పోస్ట్‌.. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌

By అంజి  Published on  7 April 2020 7:57 AM GMT
సీఎంపై నెటిజన్‌ పోస్ట్‌.. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్‌పై ఎప్పటికప్పుడు కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులతో వివరాలు సేకరించి ఆరా తీస్తున్నారు. ప్రజలు ఆరోగ్యం కోసం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారు.

కరోనా మహమ్మారిపై కొందరు అనునిత్యం ఫేక్‌ పోస్టులు పెడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ హెచ్చరికలు జారి చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్‌ పడుతున్న కష్టాన్ని చూసిన ఓ నెటిజన్‌.. ఆయన ఆరోగ్యం బాగుండాలని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు. ఓ బాలుడి శరీరంపై 'కేసీఆర్‌ గారు మీ ఆరోగ్యం జాగ్రత్త' అంటూ ఫొటోను షేర్‌ చేశాడు.

'ప్రపంచం మొత్తం కరోన మహమ్మారి బారినపడి అతలాకుతలం అవుతున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతినిత్యం ప్రజల బాగోగులను పర్యవేక్షిస్తూ, నిరంతరాయంగా ప్రెస్‌మీట్‌లు నిర్వహిస్తూ అహర్నిశలు ప్రజల ఆరోగ్యం కొరకు తపిస్తున్న మీరు (సీఎం కేసీఆర్‌) చల్లగా ఉండాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీరే (కేసీఆర) మాకు పెద్దదిక్కు' అంటూ నెటిజన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఈ పోస్టుపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.

తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 364కు చేరిందని, వీరిలో 45 మంది పూర్తిగా కోలుకున్నారని, 11 మంది మృతి చెందారు.

Next Story
Share it